NIA officials Search in Telangana and Chhattisgarh: తెలంగాణా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు నిర్వహించింది. రాష్ట్రంలో వరంగల్ జిల్లాలో 5 ప్రాంతాల్లో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2 చోట్ల అధికారులు(NIA Officials) దర్యాప్తు చేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ ఒక ప్రాంతంలో సోదాలు చేసిన అధికారులు.. కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. జూన్‌లో చెర్ల పోలీస్టేషన్ పరిధిలో ముగ్గురిని అరెస్ట్ చేసిన స్థానిక పోలీసులు.. భారీగా పేలుడు పదార్ధాలు, డ్రోన్లు, తయారీ యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కేసుతో సంబంధం ఉన్న మరో 12 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ కేసు ఆధారంగా ఆగస్ట్‌లో మరో కేసు నమోదు చేసిన ఎన్‌ఐఏ అధికారులు దానిపై కూడా దర్యాప్తు చేస్తున్నారు.
NIA Search 8 Areas in Telangana and Chhattisgarh : దర్యాప్తులో భాగంగా తెలంగాణా, ఛత్తీస్‌గఢ్‌లో కలిపి మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో సోదాలు చేశారు. కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ప్రస్తుతం నిపుణులు విశ్లేషిస్తున్నారు. మావోయిస్టులకు అయుధాలు, సామాగ్రిని సరఫరా చేస్తురన్న అభియోగంపై దర్యాప్తు చేస్తున్నారు. గతంలో పట్టుబడిన ముగ్గురిప్రాధమిక విచారణలో పీపుల్స్ వార్(Peoples War) పేరుతో మావోయిస్టు కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఎన్‌ఐఏ అధికారులు తెలపారు. దేశవాళీ తుపాకులను తయారు చేసి వాటిని మావోయిస్టులకు పంపుతున్నారని పేర్కొన్నారు. నూతన సాంకేతికతను ఉపయోగంచి సీపీఐ మావోయిస్టు పార్టీ యువకులను రిక్రూట్మెంట్ చెసినట్లు ఎన్ఐఏ పేర్కొంది.