తెలంగాణ

telangana

ETV Bharat / state

'స్వరంతో మంత్రముగ్ధుల్ని చేసిన వ్యక్తి వేణుమాధవ్' - Hanmakonda latest news

మిమిక్రీకి ప్రపంచ వ్యాప్తంగా నేరెళ్ల వేణుమాధవ్ గుర్తింపు తెచ్చారని వరంగల్ మేయర్ ప్రకాష్ రావు అన్నారు. స్వరానికి ఒక రూపం తీసుకొచ్చారని కొనియాడారు. నెరేళ్ల జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.

nerelle Venumadhav Jayanti celebrations at Hanumakonda
హన్మకొండలో నెరేళ్ల వేణుమాధవ్ జయంతి వేడుకలు

By

Published : Dec 28, 2020, 9:47 PM IST

మిమిక్రీ కళకు నేరెళ్ల వేణుమాధవ్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చారని వరంగల్ మేయర్ ప్రకాష్ రావు అన్నారు. స్వరానికి ఒక రూపం తీసుకొచ్చిన వ్యక్తి అని కొనియాడారు. వరంగల్‌లో నేరెళ్ల జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

హన్మకొండ పబ్లిక్ గార్డెన్‌లో నేరెళ్ల విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వేణుమాధవ్ జయంతి సందర్భంగా ప్రముఖ సురభి కళాకారిణి పుష్పలతకు ప్రతిభా పురస్కారం అందజేశారు.

ఇదీ చూడండి:సురవరం అంటే గుర్తొచ్చేది గోల్కొండ పత్రిక : మంత్రి కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details