ఆడపిల్లలతో పాటు మగపిల్లలకు కూడా అభద్రతపై జాగ్రత్తలు చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ సభ్యులు ప్రజ్ఞ పరాందే పేర్కొన్నారు. హన్మకొండలో ఇటీవల అత్యాచారానికి గురై మృతి చెందిన చిన్నారి తల్లిదండ్రులను పరాందే పరామర్శించారు. ఘటన పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాల సంరక్షణ ఆయోగ్ ద్వారా దేశవ్యాప్తంగా 151 జిల్లాలలో బాలల సంరక్షణ బెంచ్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పిల్లలకు భద్రత కల్పించేందుకు చట్టంలో మార్పులు చేసి నేరస్థులకు మరణ శిక్ష, యావజ్జీవ శిక్ష విధించే నిబంధనలను చేర్చినట్లు తెలిపారు. నేరస్థులకు కఠిన శిక్షలు పడే విధంగా ఛార్జ్‌షీట్‌ను సమగ్రంగా రూపొందించాలని అధికారులకు సూచించారు.
'కఠిన శిక్షలు పడేలా ఛార్జ్‌షీట్ రూపొందించాలి' - 'కఠిన శిక్షలు పడేలా ఛార్జ్‌షీట్ రూపొందించాలి'
హన్మకొండలో అత్యాచారానికి గురై మృతి చెందిన 9 నెలల చిన్నారి కుంటుంబాన్ని జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ సభ్యులు ప్రజ్ఞ పరాందే పరామర్శించారు. ఘటన పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ncpcr-visit-9 months child family
'కఠిన శిక్షలు పడేలా ఛార్జ్‌షీట్ రూపొందించాలి'