హన్మకొండలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి. కరోనా దృష్ట్యా ఎలాంటి ఆర్భాటాలు లేకుండా నగర వాసులు శోభాయాత్రను నిర్వహించారు.
జిల్లాలో కొవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున ఈసారి ఇళ్లలోనే వినాయకులను ప్రతిష్టించుకున్నారు. ఈ మేరకు హన్మకొండలోని పద్మాక్షి గుండం, సిద్ధేశ్వర గుండాలలో నిమజ్జనం చేశారు. గణనాథులను కడసారి చూసేందుకు జనం ఆసక్తి కనబరిచారు.