కాకతీయుల రాజధాని ఓరుగల్లు నగరంలో విరాజిల్లుతున్న భద్రకాళీ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నేడు అమ్మవారిని భవానీ రూపంలో అలంకరించి.. ప్రత్యేక పూజలు చేశారు. వివిధ సుగంధ ద్రవ్యాలతో అమ్మవారిని అభిషేకించారు.
భవానీ అవతారంలో కొలువుదీరిన భద్రకాళీ అమ్మవారు
వరంగల్ భద్రకాళీ దేవస్థానంలో నవరాత్రి ఉత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. భవానీ అవతారంలో అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భవానీ అవతారంలో కొలువుదీరిన భద్రకాళీ అమ్మవారు
భవానీ రూపంలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. భవానీ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. పల్లకి సేవ నిర్వహించిన అర్చకులు.. సాయంత్రం అమ్మవారిని శేష వాహనంపై ఊరేగించనున్నారు.
- ఇదీ చదవండి :సూర్యప్రభ వాహనంపై అభయమిచ్చిన తిరుమలేశుడు