కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ప్రసిద్ధి చెంది.. వరంగల్ వాసుల ఇలవేల్పుగా నిలిచిన భధ్రకాళి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. తొలి రోజు అమ్మవారు బాలాత్రిపుర సుందరిగా భక్తులకు దర్శమివ్వనున్నారు. వేదమంత్రోచ్ఛరణల నడుమ వేకువజామునుంచే..ఆలయ అర్చకులు.. నిత్యాహ్నికము, సుగంధ పరిమళ ద్రవ్యములతో పూర్ణాభిషేకాలు.. అగ్ని ప్రతిష్ట, భేరి పూజ, కలశ స్థాపన చేసి తరువాత...శైలీ పుత్రీ క్రమంలో అమ్మవారిని బాలా త్రిపుర సుందరిగా అలంకరించనున్నారు. ఆదివారం నుంచి వరుసగా అన్నపూర్ణ, గాయత్రీ, శ్రీమహాలక్ష్మి, మహా త్రిపుర సుందరి, భవానీ, సరస్వతీ, దుర్గా దేవిగా అమ్మవారిని అలంకరిస్తారు. విజయదశమి నాడు అమ్మవారి నిజరూప దర్శన భాగ్యం భక్తులకు కలుగుతుంది.
శరన్నవ రాత్రి శోభను సంతరించుకున్న భద్రకాళి ఆలయం - నవరాత్రి ఉత్సవాలు
వరంగల్ భధ్రకాళి అమ్మవారి ఆలయం.. శరన్నవరాత్రి ఉత్సవ శోభతో కళకళలాడుతోంది. నేటి నుంచి 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. కొవిడ్ నిబంధనలు అనుసరించి భక్తులను దర్శనాలకు అనుమతించనున్నారు.
శరన్నవ రాత్రి శోభను సంతరించుకున్న భద్రకాళి ఆలయం
ఉదయం, సాయంత్రం వేళల్లో అమ్మవారికి ఆలయంలో వాహన సేవలుంటాయని అర్చకులు తెలిపారు. కొవిడ్ నిబంధనలను అనుసరించి ఎక్కడా భక్తులు గుమిగూడకుండా దూరం పాటిస్తూ దర్శనం చేసుకునే విధంగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఇవీ చూడండి: యాదాద్రిలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు