వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో దేవీ శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజును పురస్కరించుకొని హన్మకొండలోని వేయి స్తంభాల ఆలయంలో అమ్మవారు లలితా త్రిపుర సుందరి దేవీ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
వేయిస్తంభాల గుడిలో లలితా త్రిపుర సుందరిగా అమ్మవారు - వేయి స్తంభాల గుడిలో నవరాత్రి వేడుకలు
వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని వేయి స్తంభాల గుడిలో నవరాత్రి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఐదోరోజున అమ్మవారు లలితా త్రిపుర సుందరీ దేవీగా దర్శనమిచ్చారు. ఆలయంలో మేయర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వేయిస్తంభాల ఆలయంలో ఘనంగా శరన్నవరాత్రులు
వరంగల్ మేయర్ గుండా ప్రకాష్ రావు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కరోనా మహమ్మారి నుంచి భక్తులకు విముక్తి కలిగించాలని అమ్మవారిని వేడుకున్నానని మేయర్ తెలిపారు. ఉదయం నుంచే భక్తులు ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
ఇదీ చదవండి:వేయిస్తంభాల గుడిలో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు