వరంగల్ భద్రకాళి దేవస్థానంలో దేవి నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు అమ్మవారికి వివిధ సుగంధ ద్రవ్యాలతో పాటు పసుపు, కుంకుమతో ఉదయం అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారు సరస్వతి దేవీ అలంకరణలో దర్శనమిచ్చారు.
భద్రకాళి అమ్మవారికి ఆభరణాలు సమర్పించిన ఎమ్మెల్సీ పోచంపల్లి - భద్రకాళి అమ్మవారికి ఆభరణాలు
భద్రకాళి ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు అమ్మవారిని సరస్వతి దేవీగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అమ్మవారిని దర్శించుకొని రూ.6లక్షల విలువ చేసే ఆభరణాలు సమర్ఫించారు. ఆలయం ప్రాంగణం భక్తులతో రద్దీగా మారింది.
![భద్రకాళి అమ్మవారికి ఆభరణాలు సమర్పించిన ఎమ్మెల్సీ పోచంపల్లి navaratri celebrations at bhadrakali temple in warangal by mlc pochampally srinivas reddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9281223-381-9281223-1603434105050.jpg)
భద్రకాళి అమ్మవారికి ఆభరణాలు సమర్పించిన ఎమ్మెల్సీ పోచంపల్లి
ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రూ.6లక్షలు విలువ చేసే కంఠాభరణాలు సమర్పించారు. ఎమ్మెల్సీతో పాటు వరంగల్ మేయర్ గుండా ప్రకాశ్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.
ఇదీ చదవండి:శ్రీ భద్రకాళి ఆలయంలో వైభవంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు