వరంగల్ నిట్‌లో జాతీయ స్థాయి సమావేశాలు - వరంగల్ నిట్‌లో పూర్వ విద్యార్థులతో జాతీయ స్థాయి సమావేశాలు
వరంగల్ నిట్‌ను ప్రపంచ స్థాయి విద్యాసంస్థగా తీర్చిదిద్దడంలో పూర్వ విద్యార్థుల పాత్రపై వర్సిటీలో జాతీయ స్థాయి సమావేశాలు నిర్వహించారు.
వరంగల్ నిట్‌లో జాతీయ స్థాయి సమావేశాలు
వరంగల్ జాతీయ సాంకేతిక విద్యాసంస్థ నిట్‌లో జాతీయ స్థాయి సమావేశాలు నిర్వహించారు. నిట్ వరంగల్‌ను ప్రపంచ స్థాయి విద్యాసంస్థగా తీర్చిదిద్దడంలో పూర్వ విద్యార్థుల పాత్ర అనే అంశంపై సదస్సు జరిగింది. వజ్రోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎన్బీఏ న్యూదిల్లీ ఛైర్మన్ ప్రొఫెసర్ కేకే అగర్వాల్, నిట్ వరంగల్ సంచాలకుడు ఎన్వీ రమణారావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సులో 500 మంది పూర్వ నిట్ విద్యార్థులు పాల్గొననున్నారు.