అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో విద్యార్థినులు ర్యాలీ చేపట్టారు. హన్మకొండలోని అమరవీరుల స్థూపం నుంచి కాళోజీ కూడలి వరకు ఓ నర్సింగ్ కళాశాల విద్యార్థినులు ప్రదర్శన నిర్వహించారు.
హన్మకొండలో నర్సింగ్ విద్యార్థినుల ర్యాలీ - వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో నర్సింగ్ విద్యార్థినుల ర్యాలీ
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని నర్సింగ్ విద్యార్థినులు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.

హన్మకొండలో నర్సింగ్ విద్యార్థినుల ర్యాలీ
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలంటూ నినాదాలు చేశారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. ప్రతి మహిళ న్యాయ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ ర్యాలీలో దాదాపు 300 మంది విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
హన్మకొండలో నర్సింగ్ విద్యార్థినుల ర్యాలీ