వరంగల్ అర్బన్ జిల్లా అమరవీరుల స్తూపం వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘనటపై నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్పందించారు. వెంకటేశ్వర్లు ఆత్మహత్యయత్నానికి పాల్పడానికి తనకు ఎటువంటి సంబంధం లేదని ఎమ్మెల్యే వెల్లడించారు. దీనికి సంబంధించి 24 గంటల్లోపు పూర్తి వివరాలు వెల్లడిస్తానని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు.
అతని ఆత్మహత్యాయత్నానికి నేను బాధ్యుడిని కాదు:ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి - వరంగల్ అర్బన్ జిల్లా నేర వార్తలు
హన్మకొండ అమరవీరుల స్తూపం వద్ద... తన చావుకు కారణం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంటూ ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై ఎమ్మెల్యే స్పందించారు. ఘటనకు తనకు ఎటువంటి సంబంధం లేదని... ఆధారాలు చూపిస్తే బాధ్యత వహిస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
అతని ఆత్మహత్యాయత్నానికి నేను బాధ్యుడిని కాదు:ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
సామాజిక మాధ్యమాల్లో చూపిస్తున్న లేఖపై అనుమానాలు ఉన్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. చాలా మందికి సాయం చేశానే తప్ప... ఎవ్వరిని బాధపెట్టలేదని వెల్లడించారు.
ఇదీ చూడండి:గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం.. ఎమ్మెల్యే కారణమని లేఖ