రాష్ట్రానికి కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని... కేంద్రం తప్పకుండా మంజూరు చేయాలని లోక్‌సభలో బడ్జెట్‌పై చర్చలో తెరాస లోక్‌సభాపక్ష నేత నామ నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు రావాల్సిన వివిధ రైల్వే లైన్లలపై ఇప్పటికే కేంద్రం దృష్టికి తీసుకువచ్చామని తెలిపారు.
''రైల్వే కోచ్ ఫ్యాక్టరీని రద్దు చేస్తూ ఈ మధ్యనే ఓ లేఖ ఇచ్చారు. పార్లమెంటులో ఆమోదం పొంది చట్టం అయిన తర్వాత కోచ్ ఫ్యాక్టరీని నిర్మించాలి. అలా హామీని అమలు చేయకపోతే.. పార్లమెంటు చేసిన చట్టంపై ప్రజల విశ్వాసం కోల్పోతారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని తప్పకుండా తెలంగాణకు మంజూరు చేయాలి.''