మహాశివరాత్రి పర్వదినాన శివయ్య దర్శనానికి ముస్లిం భక్తులు సైతం తరలివస్తున్నారు. కోరిన కోర్కెలు తీర్చే బోళా శంకరుడిని భక్తితో పూజిస్తున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా మడికొండలోని శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి దేవాలయంలో రహీం పాషా అనే ముస్లిం భక్తుడు కుటుంబ సమేతంగా శివయ్యను దర్శించుకున్నాడు.
మడికొండ శివయ్య సన్నిధికి ముస్లిం భక్తులు - మహా శివరాత్రి వార్తలు
శివయ్యకు హిందువులే కాదు.. ముస్లిం భక్తులు ఉన్నారు. మహాశివరాత్రి సందర్భంగా ముస్లిం భక్తులు కూడా జంగమయ్యను దర్శించుకుంటున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా మడికొండలో రహీం పాషా కుటుంబ సమేతంగా వచ్చి శివున్ని దర్శించుకున్నాడు.
శివయ్య సన్నిధికి ముస్లిం భక్తులు
చిన్నతనం నుంచే శివయ్య అంటే అమితమైన భక్తి అని... ప్రతీ సంవత్సరం శ్రీరామ నవమి, శివరాత్రి సమయంలో కచ్చితంగా దైవదర్శనానికి వస్తానని రహీం తెలిపాడు. ఇక్కడి మిత్రులు, అర్చకులు తనను గర్బగుడిలోకి తీసుకొని వెళ్లి ప్రత్యేక దర్శనం చేయించడం చాలా ఆనందాన్ని కలిగిస్తుందని రహీం పాషా పేర్కొన్నాడు.
ఇవీ చూడండి:శ్రీశైలంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు
Last Updated : Feb 21, 2020, 6:40 PM IST