తెలంగాణ

telangana

ETV Bharat / state

భద్రకాళి చెరువులో గుర్రపు డెక్క తొలగింపు - Warangal District Latest News

వరంగల్‌ భద్రకాళి చెరువులోని గుర్రపు డెక్కను ఆధునిక యంత్రాలతో మున్సిపల్ అధికారులు తొలగిస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో ట్యాంక్​బండ్ పనులు పూర్తికానున్నాయి. సందర్శకులకు ఇదొక పర్యాటక ప్రాంతంగా మారనుంది.

gurrapu dekka removal works at Bhadrakali pond, Warangal
వరంగల్‌ భద్రకాళి చెరువులో గుర్రపు డెక్క తొలగింపు పనులు

By

Published : Jan 24, 2021, 1:48 PM IST

వరంగల్‌ చారిత్రాత్మక భద్రకాళి చెరువులోని గుర్రపు డెక్కను మున్సిపల్ అధికారులు తొలగిస్తున్నారు. హైదరబాద్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన ఆధునిక యంత్రాలను ఇందులో ఉపయోగిస్తున్నారు.

పనులు వేగంగా జరుగుతుండటంతో భద్రకాళి చెరువు పరిశుభ్రంగా మారనుంది. నగర ప్రజలు సేద తీరేందుకు అనువుగా తయారవుతోంది.

పరిసరాలు మరింత అందంగా, ఆహ్లదకర వాతావరణంతో ఆలరించనున్నాయి. సందర్శకులకు పర్యాటక ప్రాంతంగా మారనుంది. మరి కొద్ది రోజుల్లో పనులు పూర్తవనున్నాయి.

ఇదీ చూడండి:దుర్గం చెరువు తీగల వంతెనపై తొలిసారిగా 10కె, 5కె రన్​

ABOUT THE AUTHOR

...view details