తెరాస అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచార గడువు రెండు రోజులే ఉండడం వల్ల ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పార్టీ నాయకులు తమదైన శైలిలో తిరుగుతూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.
జోరుగా సాగుతున్న వరంగల్ పుర ఎన్నికల ప్రచారం - వరంగల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం
వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచార గడువు సమీపిస్తుండడం వల్ల తెరాస నేతలు ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తమదైన శైలిలో ఓట్లను అభ్యర్థిస్తున్నారు. 34వ డివిజన్లో మేయర్ అభ్యర్థి భారీ ప్రదర్శనతో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

municipal elections campaign, Warangal, trs
34వ డివిజన్లో మేయర్ అభ్యర్థి దిడ్డి కుమారస్వామి భారీ ప్రదర్శనతో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. 18వ డివిజన్లో బాబు ఇంటింటికి తిరిగి ఓటర్లను అభ్యర్థించారు. ప్రచార కార్యక్రమంలో మైనర్లు కండువాలు కప్పుకుని తిరగడం వివాదాస్పదంగా మారింది. గ్రేటర్ పీఠంపై గులాబీ జెండా ఎగురవేస్తాం అని తెరాస నేతలు ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి:తాగునీటితో కరోనా వ్యాప్తి చెందే ఛాన్స్ లేదు:డాక్టర్ రాకేశ్ మిశ్ర