ఉత్తర తెలంగాణకు తలమానికమైన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో అంతంతమాత్రంగానే సౌకర్యాలు ఉన్నాయని ములుగు ఎమ్మెల్యే సీతక్క తెలిపారు. మొత్తం ఇరవై నాలుగు జిల్లాల నుంచి ప్రతి నిత్యం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి రోగులు చికిత్స నిమిత్తం వస్తారని... కొవిడ్ వార్డు కూడా ఎంజీఎం ఆస్పత్రిలో ఏర్పాటు చేయడం వల్ల సాధారణ రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. కొవిడ్ విభాగాన్ని ఎంజీఎం ఆస్పత్రిలో కాకుండా హంటర్ రోడ్‌లోని మెడికేర్ ఆసుపత్రిలో ఏర్పాటు చేస్తే మిగిలిన రోగులకు కొంత సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు. ఇది ఇలా ఉంటే ఆసుపత్రిలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని తెలిపిన సీతక్క.. ఒక్కో విభాగంలో పనిచేసే వైద్యులపై పని భారం పడడం వల్ల ఒత్తిడికి గురవుతున్నారని వ్యాఖ్యానించారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మాదిరిగా రూపుదిద్దుకున్నా సేవలు మాత్రం అందడం లేదని అన్నారు.
కొవిడ్ చికిత్సను వెంటనే ఆరోగ్యశ్రీలో చేర్చాలి: ములుగు ఎమ్మెల్యే సీతక్క - corona virus latest news
ప్రభుత్వం వెంటనే కొవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చి బాధితులను ఆదుకోవాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిని ఆమె పరిశీలించారు. ఆస్పత్రిలో సౌకర్యాలు అంతంతమాత్రంగానే ఉన్నాయని తెలిపారు. కొవిడ్ విభాగాన్ని ఎంజీఎం ఆస్పత్రిలో కాకుండా హంటర్ రోడ్‌లోని మెడికేర్ ఆసుపత్రిలో ఏర్పాటు చేస్తే మిగిలిన రోగులకు కొంత సౌకర్యవంతంగా ఉంటుందన్నారు.
కొవిడ్ విభాగంలో అందించిన సేవలను కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసులును అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలు విభాగాలలో పర్యటించారు. కొవిడ్ రోగులకు ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యాలు చికిత్స అందించడంలో మీనమేషాలు లెక్కిస్తున్నాయని.. ప్రభుత్వం వెంటనే కొవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చి కొవిడ్ బాధితులను ఆదుకోవాలని అన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత పాలకులపై ఉందన్నారు. కరోనా వైరస్‌పై అవగాహన కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఎద్దేవా చేశారు.
ఇవీ చూడండి: మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరికి కరోనా పాజిటివ్