యూపీ హాథ్రస్ యువతి హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఈ ఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ధర్నా చేపట్టారు. రోజురోజుకు ఎస్సీలపై దాడులు, హత్యాచారాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహించారు.
సుప్రీ కోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి: మందకృష్ణ మాదిగ - హాథ్రస్ ఘటనకు వ్యతిరేకంగా నిరసనల వార్తలు హన్మకొండ
యూపీలోని హాథ్రస్ యువతి హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని హన్మకొండలో ధర్నా చేపట్టారు. అగ్రకులాల మహిళలకు అన్యాయం జరిగితే స్పందించే ప్రభుత్వాలు.. అణగారిన వర్గాల యువతులకు జరిగితే ఏ మాత్రం స్పందించడం లేదన్నారు.

సుప్రీ కోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి: మందకృష్ణ మాదిగ
దేశంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల ప్రజలకు రక్షణ లేకుండా పోతోందని మందకృష్ణ మాదిగ ఆవేదన చెందారు. అగ్రకులాల మహిళలకు అన్యాయం జరిగితే స్పందించే ప్రభుత్వాలు.. అణగారిన వర్గాల యువతులకు జరిగితే ఏ మాత్రం స్పందించడం లేదన్నారు.
ఇదీ చదవండి:'భూములు ఇస్తానని చెప్పి ఉన్న భూమిని లాక్కుంటే ఎలా'