గ్రేటర్ వరంగల్లోని సమస్యలకు కాంగ్రెస్ పార్టీ మాత్రమే పరిష్కారం చూపగలదని ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో హస్తం అభ్యర్థులకు మద్దతుగా ర్యాలీలో పాల్గొన్నారు. వరంగల్ నగర అభివృద్ధిపై తెరాస ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోయిందని విమర్శించారు.
'వరంగల్ నగర సమస్యల పరిష్కారం కాంగ్రెస్తోనే సాధ్యం' - mp revanth reddy visited warangal
గ్రేటర్ వరంగల్ ఎన్నికల ప్రచారం రోజురోజుకు వేడెక్కుతోంది. ప్రధాన పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ఎంపీ రేవంత్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. వరంగల్ అభివృద్ధిపై తెరాస ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు.
ఎంపీ రేవంత్ రెడ్డి, గ్రేటర్ వరంగల్ ఎన్నికలు, వరంగల్ కార్పొరేషన్
రైలు కోచ్ ఫ్యాక్టరీ తీసుకురావడంలో తెరాస సర్కార్ అలసత్వం వహించిందని ఆరోపించారు. దానివల్లే ఫ్యాక్టరీ చేజారిపోయిందని అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించి.. తెరాస, భాజపాలకు బుద్ధి చెప్పాలని కోరారు.