వరంగల్ జిల్లాలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ పుట్టిన రోజు వేడుకలను కాంగ్రెస్ నాయకులు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా హన్మకొండలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు, మున్సిపాలిటీ కార్మికులు, వైద్యులను ఘనంగా సన్మానించారు.
వరంగల్‌లో రాహుల్‌గాంధీ జయంతి వేడుకలు - రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు
ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ పుట్టిన రోజు వేడుకలను వరంగల్‌లో కాంగ్రెస్ నాయకులు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా జిల్లాలోని హన్మకొండలో పోలీసులు, మున్సిపాలిటీ కార్మికులు, వైద్యులను ఘనంగా సన్మానించారు.
వరంగల్‌లో రాహుల్‌గాంధీ జయంతి వేడుకలు
కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో నిరాడంబరంగా వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. కరోనా నివారణ కోసం కృషి చేస్తున్న వారికి సన్మానం, ఆసుపత్రిలో ఉన్న రోగులకు పండ్ల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టామన్నారు.
ఇదీ చూడండి:చైనాతో వివాదంపై నేడు ప్రధాని అఖిలపక్ష భేటీ