ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / state

మొక్కలు నాటిన ఎంపీ బండప్రకాశ్​.. మరో నలుగురికి గ్రీన్​ ఛాలెంజ్​ - green challenge 2019

రాజ్యసభ సభ్యుడు సంతోష్​ విసిరిన ఛాలెంజ్​ను ఎంపీ బండప్రకాశ్ స్వీకరించారు. హన్మకొండలోని జూపార్కులో మూడు మొక్కలను నాటారు. మరో నలుగురికి ఎంపీ ప్రకాశ్​ గ్రీన్​ ఛాలెంజ్​ చేశారు.

మొక్కలు నాటిన ఎంపీ బండప్రకాశ్​.. మరో నలుగురికి గ్రీన్​ ఛాలెంజ్​
author img

By

Published : Oct 30, 2019, 11:36 AM IST

ఎంపీ సంతోష్​ చేసిన గ్రీన్​ ఛాలెంజ్​ను స్వీకరించిన ఎంపీ బండ ప్రకాశ్...​ వరంగల్​లో మొక్కలను నాటారు. హన్మకొండలోని జూపార్కులో మూడు మొక్కలను నాటి మరో నలుగురికి గ్రీన్​ ఛాలెంజ్​ చేశారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్​ హరివంశ్​, మహారాష్ట్ర నుంచి రాజ్యసభ సభ్యురాలు వందన చౌదరి, ఆంధ్రప్రదేశ్​ నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఉన్న డాక్టర్​ సంజయ్​ కుమార్​, పుదుచ్చేరి నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న గోపాలకృష్ణకు గ్రీన్​ ఛాలెంజ్​ విసిరారు. ప్రతి ఒక్కరు మొక్కలను నాటి పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రాన్ని హరితవనంగా మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్​ విశేషంగా కృషి చేస్తున్నారని.. ఇందులో భాగంగా అందరు భాగస్వాములు కావాలని పేర్కొన్నారు.

మొక్కలు నాటిన ఎంపీ బండప్రకాశ్​.. మరో నలుగురికి గ్రీన్​ ఛాలెంజ్​

ABOUT THE AUTHOR

...view details