తన కార్యాలయంలోని చెత్తను తానే స్వయంగా స్వచ్ఛ ఆటోకు అందించారు రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాష్. వరంగల్‌లో పారిశుద్ధ్య కార్యక్రమం ఓ ఉద్యమంలా జరగాలని పేర్కొన్నారు. హన్మకొండ 38వ డివిజన్ నంది హిల్స్‌లో ఉన్న తన కార్యాలయంలోని చెత్తను స్వచ్ఛ ఆటోకు అందించారు.
'పారిశుద్ధ్యం... ఓ ఉద్యమంగా జరగాలి' - స్వచ్ఛ ఆటోకు చెత్తను ఇచ్చిన ఎంపీ బండ ప్రకాష్
పారిశుద్ధ్య కార్యక్రమం ఓ ఉద్యమంలా జరగాలని రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాష్ అన్నారు. హన్మకొండ 38వ డివిజన్ నందిహిల్స్‌లో.. ఆయన క్యాంప్ కార్యాలయంలోని చెత్తను స్వయంగా స్వచ్ఛ ఆటోకు ఆయనే అందించారు.

'పారిశుద్ధ్యం... ఓ ఉద్యమంగా జరగాలి'
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా ప్రతి ఒక్కరు... తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేయాలని సూచించారు. దానిని బయట పారేయకుండా స్వచ్ఛ ఆటోలకు అందించాలని తెలిపారు. చెత్తను సేకరించడానికి ప్రతి 500 గృహాలకో స్వచ్ఛ ఆటో చొప్పున గ్రేటర్ వ్యాప్తంగా 194 ఆటోలను అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు.