తెలంగాణ

telangana

ETV Bharat / state

ఫ్యాన్స్​ సందడి.. మాస్కులు ధరించకుండా వేడుకలు - vakeel sab fans celebrations

రాష్ట్రంలో కరోనా పెద్ద ఎత్తున విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో పవర్​స్టార్ పవన్ కల్యాణ్ మూవీ విడుదలైంది. ఇక అభిమానుల ఆనందానికి అవధులు లేవు. కానీ కొవిడ్​ విస్తరిస్తున్న తరుణంలో నిబంధనలు పాటించకుండా అభిమానులు సంబురాలు చేసుకున్నారు. అనేక మంది మాస్కులు ధరించకుండా వేడుకలు చేసుకున్నారు.

no masks wearing fans, hanam konda news today
ఫ్యాన్స్​ సందడి.. మాస్కులు ధరించకుండా వేడుకలు

By

Published : Apr 9, 2021, 1:11 PM IST

ఫ్యాన్స్​ సందడి.. మాస్కులు ధరించకుండా వేడుకలు

హన్మకొండలో వకీల్ సాబ్ సినిమా సందర్భంగా అభిమానులు సందడి చేశారు. కరోనా విజృంభిస్తున్న సమయంలోనూ ఏ ఒక్కరూ కొవిడ్​ నిబంధనలు పాటించడం లేదు. మాస్కు ధరించకుండా గుంపులు గుంపులుగా భయం లేకుండా తిరిగారు. ఎక్కువ శాతం మంది మాస్కు ధరించకుండా సినిమా థియేటర్​కు తరలివెళ్లారు.

తమ అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ సినిమా మూడేళ్ల తర్వాత విడుదల కావడం వల్ల.. అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. సినిమా థియేటర్ల వద్ద హంగామా చేశారు. పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

ఇదీ చూడండి:''వకీల్​సాబ్'.. నా కెరీర్​లో ఉత్తమ చిత్రం'

ABOUT THE AUTHOR

...view details