బురదరోడ్ల మీద ప్రయాణం... పగలే చుక్కలు - motorists face difficulties to ride on damaged roads at hanmakonda in warangal urban district
రహదారులు గోతులమయమైతే..ప్రయాణం నరకప్రాయమవుతుంది. గుంతలు పడిన దారుల్లో ప్రయాణించలేక వాహనదారులు నానా ఇబ్బందులు పడతారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అంటీ ముట్టినట్లు వ్యవహరిస్తున్నారు. ఇదీ హన్మకొండలోని రహదారుల పరిస్థితి.

రోడ్లు గుంతలమయం... ప్రయాణం నరకప్రాయం
రోడ్లు గుంతలమయం... ప్రయాణం నరకప్రాయం
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని రహదారులు చిన్న చినుకు పడితే చాలు బురదమయమయ్యాయి. అడుగుకో గుంత వల్ల ప్రయాణించడానికి నరకప్రాయంగా మారాయి. వాన పడితే చాలు.... ఎక్కడ గుంతలున్నాయో ఎక్కడ రోడ్డుందో అర్థం కాని పరిస్థితి. ఆ గుంతల్లో పడి ఎందరో గాయాలపాలయ్యారు. మరికొంత మంది ప్రాణాలు కోల్పోయారు. అయినా అధికారులకు పట్టింపులేదు. అడుగుకో గోతితో అధ్వాన్నంగా మారిన హన్మకొండ రహదారులను పట్టించుకునే వారే లేరంటూ నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
- ఇదీ చూడండి : ఇవి తింటే... ఇక అంతే..!