వరంగల్ అర్బన్ జిల్లా వేలేరు మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట తల్లీకుమారుడు ఆత్మహత్యకుSUICIDE ATTEMPT) యత్నించారు. భూ సమస్యలు(LAND ISSUES) పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పెట్రోల్ మీద పోసుకున్నారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వారిని అడ్డుకున్నారు.
SUICIDE ATTEMPT: తహసీల్దార్ కార్యాలయం ఎదుట తల్లీకుమారుడి ఆత్మహత్యాయత్నం - తెలంగాణ వార్తలు
17:30 July 12
వేలేరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట తల్లీకుమారుడు ఆత్మహత్యాయత్నం
వేలేరు మండల కేంద్రానికి చెందిన మహ్మద్ మహబూబి, ఆమె కూమారుడు ఖాసీంకు సర్వే నంబర్ 729/A2లో 0.14 గుంటలు, 729/B లో 0.26 గుంటలు భూమి ఉందని తెలిపారు. 2005 లో రూ.41,000కు కొనుగోలు చేశామని వెల్లడించారు. సాదాబైనామాలో దరఖాస్తు చేసుకోగా మహబూబి పేరున 1బి పహాణి వచ్చిందని పేర్కొన్నారు. పదిహేనేళ్ల నుంచి తమ ఆధీనంలో ఉందని వివరించారు.
న్యాయం చేయండి
ఆ భూమిని 2005లో అమ్మలేదని... కొంతమంది వ్యక్తులు 2018లో అధికారులకు డబ్బులు ముట్టజెప్పి వారి పేరున పట్టా చేసుకున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వారి పేరున పట్టా అయిన విషయం తమకు తెలియదని వాపోయారు. ఆ భూమిని తామే కొనుగోలు చేశామని చెప్పారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. సిబ్బంది అప్రమత్తతతో ప్రమాదం తప్పింది.
ఇదీ చదవండి:Kaushik Reddy: కాంగ్రెస్ పార్టీకి కౌశిక్‌రెడ్డి రాజీనామా