తెలంగాణ

telangana

ETV Bharat / state

లాక్​డౌన్​ విధింపుపై కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి కీలక వ్యాఖ్యలు - is any lock down in India again

దేశంలో లాక్​డౌన్​ విధింపుపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్​రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక పరిస్థితులను గమనిస్తూ రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసిన ఆయన.. ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు.

kishan reddy on lockdown
లాక్​డౌన్​ విధింపుపై కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి కీలక వ్యాఖ్యలు

By

Published : Apr 26, 2021, 5:20 PM IST

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి లాక్​డౌన్​ విధింపుపై కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా తీవ్రతను బట్టి రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవాలని.. కేంద్రం భావిస్తోందని తెలిపారు. లాక్​డౌన్​, 144 సెక్షన్​, రాత్రి కర్ఫ్యూ, కంటైన్​మెంట్​ జోన్​ విధింపుపై స్థానిక పరిస్థితులను పరిగణలోకి తీసుకొని నిర్ణయం తీసుకొనే అధికారం.. రాష్ట్రాలకు ఇచ్చినట్లు చెప్పారు. ఇప్పటి వరకు కేంద్రం ప్రభుత్వం నుంచి లాక్​డౌన్​కు సంబంధించిన ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.

ప్రధానంగా దేశంలోని పది రాష్ట్రాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉందని కిషన్​రెడ్డి చెప్పారు. రెండో దశ కరోనా ఊహించిన దానికంటే ఉద్ధృతంగా ఉందన్న ఆయన... అందువల్లే కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని అభిప్రాయపడ్డారు. కొవిడ్​ కేసులు, మరణాలు విషయంలో దాచాల్సిన అవసరం ఏం లేదని కిషన్​రెడ్డి స్పష్టం చేశారు. సమస్యలన్నింటినీ వారం రోజుల్లో అధిగమిస్తామన్నారు. రానున్న రోజుల్లో మెరుగైన పరిస్థితులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

లాక్​డౌన్​ విధింపుపై కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి కీలక వ్యాఖ్యలు

ఇవీచూడండి:ట్విట్టర్​లో కేటీఆర్​కు వినతులు.. సానుకూలంగా స్పందిస్తున్న మంత్రి

ABOUT THE AUTHOR

...view details