ఎండలు మండిపోతున్నాయి. ఎండ వేడికి మనుషులే కాదు... జంతువులు కూడా తట్టుకోలేకపోతున్నాయి. ఈ తరుణంలో వరంగల్లో కోతులు వేడికి తట్టుకోలేక నీళ్లలో జలకాలాడాయి.
జలకాలాడుతూ సందడి చేసిన కోతులు - వరంగల్లో సందడి చేసిన కోతులు
సూర్యుడి ప్రతాపంతో ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండల వేడికి మనుషులమే తట్టుకోలేక పోతున్నాం. ఇక జంతువుల పరిస్థితి మరి దారుణం. ఈ నేపథ్యంలో వేడి నుంచి ఉపశమనం పొందడానికి వరంగల్లో అల్లరి కోతులు నీటిలో మునిగితేలాయి. ముచ్చటగా నీటిలో గెంతులు వేస్తూ ఎండి వేడి నుంచి సేదతీరాయి.

జలకాలాడుతూ సందడి చేసిన కోతులు
జలకాలాడుతూ సందడి చేసిన కోతులు
అసలే కోతులు అంటే వాటి గోల చెప్పనవసరం లేదు. నీళ్లలో మునిగి తేలుతూ ఎగురి దూకుతూ సందడి చేశాయి. అక్కడ ఉన్న నీటి కొలనులో చల్లదనానికి చాలా సేపు అందులోనే ఆడుతూ ఎండ వేడి నుంచి ఉపశమనం చెందాయి.
ఇదీ చూడండి :'పూర్తిగా కప్పి ఉంచే కళ్లజోళ్లు పెట్టుకోవడం మేలు'