వరంగల్లో బానోతు బాలాజీ అనే వ్యక్తికి సంబంభించిన పెద్ద మొత్తంలో నగదుఉన్న బ్యాగు గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లారు. వరంగల్ రైల్వే స్టేషన్లో బాలాజీ స్పృహ తప్పి పడిపోయాడు. ప్రయాణికుల సమాచారం మేరకు 108 సిబ్బంది హుటాహుటిన ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అతని వివరాలు తెలియనందున బాలాజీ బ్యాగు ఆసుపత్రి ఔట్ పోస్ట్ పోలీసులకు అప్పగించారు.
భారీ నగదున్న బ్యాగ్ మాయం.. పోలీసుల వేట - money bag missing
స్పృహ తప్పి పడిపోయిన వ్యక్తి నగదు బ్యాగు మిస్సైన ఘటన వరంగల్లో చోటుచేసుకుంది. రైల్వే స్టేషన్లో స్పృహ తప్పిపడిపోగా... ప్రయాణికుల సమాచారంతో 108 సిబ్బంది ఎంజీఎం ఆసుపత్రికి తరలించి, అతని బ్యాగు ఆసుపత్రి అవుట్ పోస్టు పోలీసులకు అప్పగించారు. గుర్తుతెలియని వ్యక్తి వచ్చి బ్యాగు తీసుకెళ్లాడు.
కాసేపటి తర్వాత బాలాజీ బ్యాగు ఇవ్వమన్నాడని గుర్తుతెలియని వ్యక్తి వచ్చి తీసుకెళ్లాడు. కానీ బాలాజీ తేరుకున్న తర్వాత తన బ్యాగు గురించి సిబ్బందిని అడిగాడు. బ్యాగులో పెద్ద మొత్తంలో నగదు ఉన్నట్లు తెలిపాడు. తానెవరికీ పంపించలేదని చెప్పాడు. కానీ అంత పెద్ద మొత్తంలో నగదు ఉంటే కనీసం వివరాలు తెలుసుకోకుండా పోలీసులు ఎలా ఇచ్చారని ఆసుపత్రి వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నగదు అక్రమంగా తరలిస్తున్నారా లేక ఎక్కడైనా దొంగతనానికి పాల్పడ్డారా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. సీసీ ఫుటేజీ కూడా పరిశీలిస్తున్నారు.
ఇదీ చూడండి :కేసీఆర్ ఎర్రవల్లికి సర్పంచా... చింతమడకకు ఎంపీటీసీనా?: రేవంత్