తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రం హన్మకొండలో మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు ఆందోళన చేశారు. మోడల్ స్కూళ్లలో పని చేస్తున్న ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్ వర్తింపజేయాలని కోరుతూ ఏకశిలా పార్క్ ఎదుట డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను వర్తింపజేయాలని కోరారు. మోడల్ స్కూళ్లలో పని చేస్తున్న ఉపాధ్యాయులకు 010 పద్దు క్రింద వేతనాలు చెల్లించాలని విజ్ఞప్తిచేశారు.
ధర్నాకు దిగిన మోడల్ సూళ్ల ఉపాద్యాయులు - MODEL SCHOOL TEACHERS PROTESTED AT HANMAKONDA
వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రం హన్మకొండలో మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు ధర్నాకు దిగారు. తమ సమస్యలు వెంటనే పరిష్కరిచాలని డిమాండ్ చేశారు.

MODEL SCHOOL TEACHERS PROTESTED AT HANMAKONDA
ధర్నాకు దిగిన మోడల్ సూళ్ల ఉపాద్యాయులు