KTR Fire On BJP And Congress Leaders In Warangal : ధరలు పెంచే మోదీ.. పిరమైన ప్రధాని అంటూ.. రూ.1200కు గ్యాస్ ధరను పెంచిన వారిని ఏం చేయాలని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ విమర్శించారు. వరంగల్ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో పాటు పాల్గొని.. ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీల మీద విరుచుకుపడ్డారు.
నల్లధనం తెచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.లక్ష వేస్తానని 9ఏళ్ల క్రితం మోదీ అన్నారు.. కానీ ఈనాడు ఒక్కరికైనా ప్రధాని ఇచ్చిన డబ్బు అందిందా అని వరంగల్ ప్రజానికాన్ని ప్రశ్నించారు. బీజేపీకు అసలు ఏదీ చేత కాదు.. వచ్చిందల్లా ఒక్కటే మత కల్లోలాలు సృష్టించడం మాత్రమేనని విమర్శించారు. పెద్ద నోట్ల రద్దు ద్వారా ఏం సాధించారని.. తిరిగి అన్ని నోట్లు బ్యాంకులకు వచ్చి చేరాయని ఎద్దేవా చేశారు. పనికి మాలిన మాటలు తప్ప పనికొచ్చే పని మోదీ సర్కార్ ఎప్పుడూ చేయలేదని ధ్వజమెత్తారు.
BRS Public Meeting In Warangal : నిత్యవసర వస్తువుల ధరలు పెరిగాయి.. గ్యాస్ రూ.1200కు పెంచారు.. అన్ని వస్తువుల ధరలు పెరిగాయని మరిప్పుడు మోదీకి తిరుగులేని విధంగా ప్రజలే బుద్ధి చెప్పాలని హితవు పలికారు. రూ. 200 పింఛన్ ఇచ్చే కాంగ్రెస్ కావాలో.. రూ.2000 ఇచ్చే బీఆర్ఎస్ కావాలో తేల్చుకోవాలని ప్రజలకు చెప్పారు. రాబంధుల చేతులకు రాష్ట్రమిద్దామా? మళ్లీ పాత తెలంగాణ రోజులను తెచ్చుకుందామా చెప్పండని ప్రజానికాన్ని మంత్రి ప్రశ్నించారు.