వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తయింది. మొత్తం 21 మంది అభ్యర్థులు నామపత్రాలు సమర్పించగా... అందులో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. తెరాస నుంచి పోటీ చేస్తున్న పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి ఇనుగాల వెంకట్రామిరెడ్డితో పాటు మరో 17 మంది అభ్యర్థుల నామపత్రాలు సక్రమంగా ఉన్నట్లు రిటర్నింగ్ అధికారి దయానంద్ తెలిపారు. మే 17 వరకు నామపత్రాల ఉపసంహరణకు గడువు ఉంది. అనంతరం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య ఖరారు కానుంది.
ఎమ్మెల్సీ ఎన్నికల నామపత్రాల పరిశీలన పూర్తి - mlc nominations scrutiny
వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ముగిసింది. మొత్తం 21 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేయగా 19 మంది బరిలో నిలిచారు.
![ఎమ్మెల్సీ ఎన్నికల నామపత్రాల పరిశీలన పూర్తి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3291640-thumbnail-3x2-vysh.jpg)
నామపత్రాల పరిశీలన పూర్తి