చట్టసభల్లో నిరుద్యోగులు, ఉద్యోగులు, విద్యావంతుల సమస్యలపై ప్రశ్నించే గొంతుకకు పట్టం కట్టాలని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ అభ్యర్థి చెరుకు సుధాకర్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఆదివారం ప్రచారం చేపట్టారు. ఉదయం వాకింగ్‌కు వచ్చిన వారితో కలిసి మాట్లాడారు.
ప్రశ్నించే గొంతుకకే పట్టం కట్టండి: చెరుకు సుధాకర్ - వరంగల్ అర్బన్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు
సమస్యలపై ప్రశ్నించే గొంతుకకే పట్టం కట్టాలని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ అభ్యర్థి చెరుకు సుధాకర్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ప్రచారం నిర్వహించారు.
ప్రశ్నించే గొంతుకకే పట్టం కట్టండి: చెరుకు సుధాకర్
ప్రశ్నించే గొంతుకకు పట్టం కట్టాలని లేకుంటే సమస్యలు ఎప్పటికీ పరిష్కారం కావని చెరుకు సుధాకర్ వ్యాఖ్యానించారు. పట్టభద్రులు అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి:ధాన్యం కొనుగోలులో దేశంలోనే అగ్రస్థానం