వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల అభ్యర్థుల ప్రచారాలు జోరందుకున్నాయి. పట్టభద్రల సమస్యలు, గెలిచిన అనంతరం తాము చేయనున్న హామీలను చెప్తూ ఆయా పార్టీల అభ్యుర్థులు ప్రజల్లోకి దూసుకుపోతున్నారు. యువ తెలంగాణ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాణి రుద్రమదేవి, వామపక్ష పార్టీలు బలపర్చిన అభ్యర్థి జయసారథి రెడ్డి ప్రచారపర్వంలో ముందుకుసాగుతున్నారు.
హన్మకొండలో ఊపందుకున్న ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రచారం - హన్మకొండలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం తాజా వార్త
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఆయా పార్టీల అభ్యర్థులు తమ తమ హామీలతో పట్టభద్రలను కలుస్తూ ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు.
హన్మకొండలో ఊపందుకున్న ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రచారం
పట్టభద్రులను కలుస్తూ తమ ఎన్నికల ప్రచారాన్ని వేగం పెంచారు. ఉదయం పూట వాకర్స్‌ను కలుస్తూ ప్రచారం చేపట్టగా మధ్యాహ్నం సమయంలో ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి తమకు ఓటు వేయాలని పట్టభద్రులను అభ్యర్థిస్తున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలు పరిష్కారం కావాలంటే ప్రశ్నించే గొంతుకను గెలిపించాలని కోరారు.
ఇదీ చదవండి:చిట్టాపూర్‌లో సుజాత.. బొప్పాపూర్‌లో రఘునందన్... తుక్కాపూర్‌లో శ్రీనివాస్‌రెడ్డి