తెలంగాణ

telangana

ETV Bharat / state

కేంద్రప్రభుత్వ వైఖరితో ప్రజలపై భారం : పల్లా రాజేశ్వర్‌ రెడ్డి

కేంద్ర ప్రభుత్వ వైఖరితో ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శించారు. వరంగల్ అర్బన్‌ జిల్లా ములుగురోడ్డు సమీపంలోని కేఎస్‌ఆర్‌ గార్డెన్స్‌లో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో నీళ్లు, నియామకాలు, నిధులే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

mlc election campaign in warangal urban district  today
కేంద్రప్రభుత్వ వైఖరితో ప్రజలపై భారం : పల్లా రాజేశ్వర్‌ రెడ్డి

By

Published : Jan 24, 2021, 6:16 PM IST

కేంద్ర ప్రభుత్వం ప్రజల మీద భారం వేస్తూ గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిందని రాజేశ్వర్‌ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో నీళ్లు, నియామకాలు, నిధులే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ త్రాగునీరు అందిస్తున్నామని తెలిపారు. వరంగల్ అర్బన్‌ జిల్లా ములుగురోడ్డు సమీపంలోని కేఎస్‌ఆర్‌ గార్డెన్స్‌లో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రతి రైతుకు సాగు నీరు అందుతోందన్నారు. రైతులకు 24 గంటల కరెంట్ అందిస్తున్న ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని శాఖల ద్వారా లక్షా 35 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని వెల్లడించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేస్తూ ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాసదే గెలుపు - ఎమ్మెల్యే చల్లా

దేశంలోనే ఎక్కడ లేని విధంగా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను యువత ప్రజలకు వివరించాలని సూచించారు. మత విద్వేషాలతో యువతను రెచ్చగొట్టాలని భాజపా నాయకులు చూస్తున్నారని విమర్శించారు. నిరుద్యోగులకు అన్ని శాఖలలో ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వం కలిపించిందన్నారు. రాష్ట్రంలో రైతు బంధు, రైతు బీమా లాంటి సంక్షేమ పథకాలు భాజపా పాలిత రాష్ట్రాలలో లేవని తెలిపారు. ఎన్నికలప్పుడు మాత్రమే కనిపించే భాజపా నాయకులు ఇన్ని రోజులు ఏం చేశారని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్‌ రెడ్డి గెలుపు ఖాయమని ఎమ్మెల్యే ధర్మారెడ్డి అన్నారు.

ఇదీ చూడండి :తహసీల్దార్‌ కార్యాలయాల్లో పని విభజన చేయాలి: కిషన్‌రెడ్డి

ABOUT THE AUTHOR

...view details