సంక్రాంతి సందర్భంగా ఆలయాలు కళను సంతరించుకున్నాయి. ప్రజాప్రతినిధులు సైతం మొక్కులు చెల్లించుకుంటున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు శ్రీ మల్లిఖార్జునస్వామిని ఎమ్మెల్యేలు ఆరూరి రమేశ్, నన్నపనేని నరేందర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి దర్శించుకున్నారు.
ఐనవోలులో ప్రజాప్రతినిధుల మొక్కులు.. భారీసంఖ్యలో భక్తులు - ఐనవోలు మల్లిఖార్జునస్వామి జాతర పాల్గొన్న ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీ
వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు శ్రీ మల్లిఖార్జునస్వామి జాతర వైభవంగా కొనసాగుతోంది. భక్తులు పెద్దసంఖ్యలో హాజరై మొక్కులు చెల్లించుకుంటున్నారు. మకర సంక్రాంతిని పురస్కరించుకుని ఎమ్మెల్యేలు ఆరూరి రమేశ్, నన్నపనేని నరేందర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు.
![ఐనవోలులో ప్రజాప్రతినిధుల మొక్కులు.. భారీసంఖ్యలో భక్తులు mlas, mlc participated in the Inavolu Mallikarjuna Swamy Jatara in warangal urban dist](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10242735-155-10242735-1610632984814.jpg)
ఐనవోలు మల్లిఖార్జునస్వామి జాతరలో ప్రజాప్రతినిధులు
అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయానికి భక్తుల రద్దీ ఇంకా కొనసాగుతోంది. ప్రజలు అధిక సంఖ్యలో హాజరై స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు.