తెలంగాణ

telangana

ETV Bharat / state

సేంద్రీయ సాగుతో లాభం.. ఆరోగ్యం: ఎమ్మెల్యే వినయభాస్కర్ - hanmalonda latest news

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ఎమ్మెల్యే వినయభాస్కర్ కూరగాయలు అమ్మారు. సహజ సిద్ధమైన సేంద్రీయ ఎరువులతో పండించిన కూరగాయలు వాడాలని సూచించారు.

MLA Vinayabhaskar sells vegetables in Hanmakonda, Warangal Urban District
కూరగాయలు అమ్మిన.. ఎమ్మెల్యే వినయభాస్కర్

By

Published : Jan 23, 2021, 2:28 PM IST

రైతులు సేంద్రీయ వ్యవయసాయం వైపు మొగ్గు చూపాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయభాస్కర్ పేర్కొన్నారు. స్థానిక రైతుబజార్ మార్కెట్​లో గో ఆధారిత వ్యవసాయంలో పండించిన ఆర్గానిక్ కూరగాయల షాప్​ను ప్రారంభించిన ఆయన.. కూరగాయలు అమ్మారు.

ప్రజల ఆరోగ్యం కోసం..

యాంత్రిక జీవన విధానంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు సహజ సిద్ధమైన సేంద్రీయ ఎరువులతో పండించిన కూరగాయలు వాడాలని సూచించారు. ప్రజల ఆరోగ్యం కోసం నగరంలో ఆరు ఆర్గానిక్ కూరగాయల కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

ఇదీ చదవండి:లైవ్​:పసుపు రైతులతో ఎంపీ అర్వింద్ సమావేశం

ABOUT THE AUTHOR

...view details