వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ఆటోలు నడుపుతూ ఉపాధి పొందుతున్న 650 మంది ఆటో డ్రైవర్లకు క్రెడాయి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను అందజేశారు. నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమనికి ప్రభుత్వ ఛీప్ విప్ వినయభాస్కర్ హాజరయ్యారు.
నిత్యావసర సరుకులు అందజేసిన వినయభాస్కర్ - నిత్యావసర సరుకులు అందజేసిన ఎమ్మెల్యే
లాక్డౌన్ సమయంలో ఏ ఒక్కరూ ఆకలితో బాధపడొద్దనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పేదలను ఆదుకుంటోందని ప్రభుత్వ ఛీప్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయభాస్కర్ అన్నారు.
నిత్యావసర సరుకులు అందజేసిన ఎమ్మెల్యే
కరోనా వైరస్ పట్ల ఎవ్వరు ఆందోళన చెందవద్దని... అలాగని నిర్లక్ష్యం చేయవద్దని ఎమ్మెల్యే సూచించారు. కరోనా వైరస్ నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు చేపట్టిందని తెలిపారు. కరోనా వ్యాధిని నివారించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
ఇవీ చూడండి:ఈటీవీ భారత్ ఎఫెక్ట్: వృద్ధురాలికి ఎమ్మెల్యే సాయం