వరంగల్ మహా నగరానికి భద్రకాళి ట్యాంక్ బండ్ ఒక మణిహారంగా నిలువనుందని నగర పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అన్నారు. భక్తుల ఇలవేల్పు అయిన భద్రకాళి అమ్మవారి చెరువు కట్టపై జరుగుతున్న ట్యాంక్ బండ్ పనులను ఛైర్మన్‌తో కలిసి ఆయన పరిశీలించారు. భద్రకాళి ట్యాంక్ బండ్ అందాలను చూసి ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ ప్రదేశం నగరవాసులకు మంచి ఆహ్లాదకరమైన అనుభూతిని ఇస్తుందన్నారు. దసరాలోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. త్వరలోనే మంత్రి కేటీఆర్ భద్రకాళి ట్యాంక్ బండ్‌ను ప్రారంభిస్తారని ఎమ్మెల్యే తెలిపారు.
ఓరుగల్లుకు మణిహారంగా భద్రకాళి ట్యాంక్‌బండ్... - ట్యాంక్ బండ్
ఓరుగల్లుకు భద్రాకాళి ట్యాంక్‌బండ్ మణిహారంగా నిలవనుందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఉద్ఘాటించారు. ట్యాంక్‌బండ్ పనులను ఛైర్మన్‌తో కలిసి ఆయన పరిశీలించారు.
'ఓరుగల్లుకు భద్రాకాళి ట్యాంక్‌బండ్ మణిహారం కానుంది'