తెరాస పార్టీ సభ్యత్వ కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందని ప్రభుత్వ ఛీప్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయభాస్కర్ అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని చౌరస్తాలో స్థానిక కార్పొరేటర్ వేముల శ్రీనివాస్ ఆధ్వర్యంలో చేపట్టిన సభ్యత్వ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ప్రతి దుకాణానికి వెళ్లి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.
'పార్టీ సభ్యత్వ నమోదుకు ప్రజల నుంచి అనూహ్య స్పందన' - వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయభాస్కర్ తాజా వార్తలు
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో చేపట్టిన తెరాస పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎమ్మెల్యే వినయభాస్కర్ పాల్గొన్నారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని.. అధిష్ఠానం ఇచ్చిన టార్గెట్ను పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. స్థానిక కార్పొరేటర్ వేముల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
'పార్టీ సభ్యత్వ నమోదుకు ప్రజల నుంచి అనూహ్య స్పందన'
సభ్యత్వం పొందిన వారికి బీమా వర్తిస్తుందని ఎమ్మెల్యే అన్నారు. పార్టీ అధిష్ఠానం ఇచ్చిన టార్గెట్ పూర్తి చేస్తామని పేర్కొన్నారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు.
ఇదీ చూడండి: యాదాద్రిలోని శివాలయ సాలహారాలకు నూతన హంగులు