ఆర్యసమాజ్ నేత స్వామి అగ్నివేశ్ మృతి పట్ల రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్ వినయ భాస్కర్, ప్లానింగ్ కమిషన్ వైస్ ఛైర్మన్ వినోద్ కుమార్ సంతాపం తెలిపారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో అగ్నివేశ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
స్వామి అగ్నివేశ్ మృతి పట్ల ఎమ్మెల్యే సంతాపం - తెలంగాణ తాజా వార్తలు
ఆర్యసమాజ్ నేత, సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్ మృతి పట్ల తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్ సంతాపం ప్రకటించారు. రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ వైస్ ఛైర్మన్ వినోద్ కుమార్‌తో కలిసి హన్మకొండలో అగ్నివేశ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
స్వామి అగ్నివేశ్ మృతి పట్ల సంతాపం తెలిపిన ఎమ్మెల్యే వినయ భాస్కర్
తెలంగాణ ఉద్యమానికి స్వామి అగ్నివేశ్ మొదటి నుంచి సంపూర్ణ మద్దతునిచ్చారని వినయ భాస్కర్ పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధన ఉద్యమానికి పూర్తి మద్దతు అందించడమే కాకుండా... జాతీయ స్థాయిలో అన్ని పార్టీలను ఏక తాటిపై తేవడానికి ప్రయత్నించారని పేర్కొన్నారు. మారుమూల పల్లెల నుంచి అంతర్జాతీయ వేదికల వరకు బాలల హక్కులు, వెట్టిచాకిరి, బానిసత్వ నిర్మూలన తదితర సామాజిక సమస్యలపై పోరాడారని పేర్కొన్నారు.