తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యేలు వినయ భాస్కర్, ఆరూరి రమేష్ - Warangal Urban District Latest News

హన్మకొండలో ఎమ్మెల్యేలు వినయ భాస్కర్, ఆరూరి రమేష్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. నగరంలోని పోలింగ్ కేంద్రాలను ఎమ్మెల్సీ అభ్యర్థులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కోదండరాం పరిశీలించారు. పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.

MLAs who exercised their right to vote were Vinaya Bhaskar and Aururi Ramesh
ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యేలు వినయ భాస్కర్, ఆరూరి రమేష్

By

Published : Mar 14, 2021, 3:54 PM IST

పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి, తెలంగాణ జన సమితి అభ్యర్థి కోదండరాం సూచించారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించి ఓటర్లను పలకరించారు.

హన్మకొండలో ప్రభుత్వ ఛీఫ్‌ విప్, ఎమ్మెల్యే వినయ భాస్కర్, ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వడ్డేపల్లిలోని పింగిలి మహిళా కళాశాలలో వినయభాస్కర్ ఓటు వేయగా, ఆర్ట్స్ కాలేజీలో రమేష్ ఓటు వేశారు.

ఇదీ చూడండి:ఓటేసేందుకు కదిలిన మహిళా లోకం..

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details