తెలంగాణ

telangana

ETV Bharat / state

'రూ.5 కోట్లతో అన్ని హంగులతో సమీకృత మార్కెట్ల నిర్మాణం'

వరంగల్​లో సమీకృత మార్కెట్ల కోసం ఎమ్మెల్యే వినయ భాస్కర్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు చర్యలు చేపట్టారు. నగరంలోని ప్రభుత్వ స్థలాలను పరిశీలిస్తున్నారు. అన్ని హంగులతో మార్కెట్లు నిర్మిస్తామని తెలిపారు.

integrated markets in warangal, warangal integrated market
వరంగల్​లో సమీకృత మార్కెట్లు, ఎమ్మెల్యే వినయభాస్కర్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తాజా వార్తలు

By

Published : Mar 30, 2021, 4:37 PM IST

అన్ని మున్సిపాలిటీల్లో సమీకృత వెజ్, నాన్​వెజ్ మార్కెట్ల నిర్మాణాలకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ భాస్కర్ అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి హన్మకొండలోని బాలసముద్రం, హంటర్ రోడ్, బస్టాండ్ పక్కన ఖాళీ స్థలాలను పరిశీలించారు. సమీకృత మార్కెట్​ కోసం నగరం​లోని ప్రభుత్వ స్థలాలను పరిశీలించామని కలెక్టర్ రాజీవ్ గాంధీ తెలిపారు.

అతి త్వరలో మార్కెట్ నిర్మాణ పనులను ప్రారంభించడానికి చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 3 సమీకృత మార్కెట్ల కోసం ప్రజలకు అనువుగా ఉండేలా స్థలాలను పరిశీలించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాలతో అన్ని హంగులతో ఒక్కొక్క మార్కెట్​కు రూ.5 కోట్లతో నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.

ఇదీ చదవండి:బతుకు చిత్రం: నగరం నిద్రపోతున్న వేళ వీధుల్లో విధులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details