వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌కుమార్ 'బస్తీ బాట' కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హన్మకొండలోని బాలసముద్రం సమీపంలోని పలు కాలనీల్లో పర్యటించారు. ప్రజలు అనేక సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. కాలనీల్లో పారిశుద్ధ్యం లోపించిందని, డ్రైనేజీలు సరిగా లేవంటూ కాలనీ వాసులు ఎమ్మెల్యే ముందు అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.
బస్తీ బాటకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే వినయ్‌కుమార్ - ఎమ్మెల్యే వినయ్ భాస్కర్
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ 'బస్తీ బాట' పేరుతో నగరంలోని పలు కాలనీల్లో పర్యటించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించడమే దీని ముఖ్య ఉద్దేశమని ఎమ్మెల్యే తెలిపారు.
బస్తీ బాటకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే వినయ్‌కుమార్