తెలంగాణ

telangana

ETV Bharat / state

వ్యాధుల పట్ల ప్రజలకు ప్రభుత్వ విప్​ అవగాహన - ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలు

సీజనల్​ వ్యాధుల పట్ల అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండలో ప్రభుత్వ విప్​ వినయ్​ భాస్కర్​ పర్యటించారు. వ్యక్తిగత శుభ్రతతో పాటు ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

mla vinay bhasker visited in vaddepally to aware on seasonal diseases
వ్యాధుల పట్ల ప్రజలకు ప్రభుత్వవిప్​ అవగాహన

By

Published : May 10, 2020, 7:37 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని వడ్డెపల్లిలో నిరుపేదలకు ప్రభుత్వ ఛీప్ విప్ వినయ్​ భాస్కర్ సరుకులను పంపిణీ చేశారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతితో కలిసి తిరుగుతూ ప్రజలకు కరోనాపై ఎమ్మెల్యే అవగాహన కల్పించారు.

ప్రతి ఒక్కరు విధిగా మాస్కు లు ధరించాలని వినయ్​భాస్కర్​ సూచించారు. అనంతరం నిరుపేదలకు నిత్యావసర సరుకులను అందజేశారు. లాక్​డౌన్​ పూర్తయ్యే వరకు ఇంట్లోనే ఉండి కరోనాను తరిమికొట్టాలని సూచించారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు.

ఇవీచూడండి:ఈనాడు-ఈటీవీ భారత్ కథనానికి స్పందన.. చిన్నారికి కంటి చూపు

ABOUT THE AUTHOR

...view details