ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా మొక్కలు నాటి, వాటిని సంరక్షించి రాబోయే తరాలకు హరిత తెలంగాణను అందించాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ సూచించారు. వరంగల్ అర్బన్ జిల్లా కాజిపేట్ ప్రధాన రహదారి మధ్య విభాగినిపై కుడా ఛైర్మన్ మర్రి యాదవరెడ్డితో కలిసి ఆయన మొక్కలు నాటారు. కుడా ఆధ్వర్యంలో నగరంలో ప్రతి ఏటా 10 లక్షల మొక్కలను నర్సరీలలో పెంచి నాటుతున్నామని, వానిటి సంరక్షిస్తున్నామని మర్రి తెలిపారు. దీనిలోభాగంగా ఈరోజు ప్రధాన రహదారులకు ఇరువైపుల 3 వేల మొక్కలు నాటినట్టు మర్రి చెప్పారు.కాలుష్యాన్ని నివారించడానికి దేవాలయాలు, పాఠశాలలు, నివాస పరిసరాలలో అందరూ తప్పనిసరిగా మొక్కలు నాటాలని ఆయన సూచించారు.
"ప్రతిఒక్కరూ స్వచ్ఛందంగా మొక్కలు నాటాలి" - ' రాష్ట్రాన్ని హరిత తెలంగాణ చేయడమే లక్ష్యం'
వరంగల్ అర్బన్ జిల్లా కాజిపేట్లో ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాన రహదారి మధ్య విభాగినిపై ఛైర్మన్ మర్రి యాదవరెడ్డితో కలిసి మొక్కలు నాటారు.
' రాష్ట్రాన్ని హరిత తెలంగాణ చేయడమే లక్ష్యం'
TAGGED:
MLA Vinay Bhasker