లాక్‌డౌన్ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు తెరాస కార్యకర్తలు తమకు తోచిన సాయమందించాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ సూచించారు. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ బంధం చెరువు ప్రాంతంలో ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
'పేదలను ఆదుకునేందుకు కార్యకర్తలు ముందుకు రావాలి' - corona update
వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్‌లో ప్రజలకు ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ నిత్యావసరాలు అందజేశారు. లాక్‌డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ముందుకు రావాలని సూచించారు.

'పేదలను ఆదుకునేందుకు కార్యకర్తలు ముందుకు రావాలి'
కార్యక్రమానికి ఛీప్ విప్ ముఖ్య అతిథిగా హాజరై... సరుకులు అందజేశారు. కరోనా కారణంగా ప్రజలు ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటున్నారని వినయ్‌భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ముందుకు రావడం అభినందించదగ్గ విషయమని తెలిపారు. ప్రజలందరూ ప్రభుత్వ సూచనలు పాటిస్తూ సహకరించాలని సూచించారు.