తెలంగాణ

telangana

ETV Bharat / state

పాఠశాలకు వెళ్లి భోజనం వడ్డించిన ఎమ్మెల్యే

రాష్ట్రంలో ప్రధానంగా పాఠశాలల్లో కొవిడ్​ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హన్మకొండలోని సుబేదారిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్​భాస్కర్ సందర్శించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలని సూచించారు.

MLA vinay bhaskar went to school and served lunch at hanamkonda
పాఠశాలకు వెళ్లి భోజనం వడ్డించిన ఎమ్మెల్యే

By

Published : Mar 19, 2021, 7:22 PM IST

రోజు రోజుకు పెరుగుతున్న కరోనా వైరస్ నేపథ్యంలోప్రజలు అప్రమత్తమవుతున్నారు. ముఖ్యంగా పాఠశాలల్లో కరోనా కేసులు పెరగడం పట్ల విద్యార్థుల్లో పాటు ఇటు తల్లిదండ్రులలోనూ ఆందోళన నెలకొంది. ఈ సందర్భంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్​ భాస్కర్ పలు ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించారు.

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని సుబేదారిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను ఆయన సందర్శించారు. తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులను పలకరించారు. కరోనా వైరస్ పట్ల ఎవరూ ఆందోళన చెందవద్దని... ప్రతి విద్యార్థి మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలని సూచించారు.

ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలన్నారు. అనంతరం పిల్లలకు వినయ్​భాస్కర్ స్వయంగా భోజనం వడ్డించారు. క్రెడాయ్ ఆధ్వర్యంలో పాఠశాలలకు కావాల్సిన సామగ్రిని ఇచ్చిన సందర్భంగా వారిని ఎమ్మెల్యే అభినందించారు. సుమారు ఐదు లక్షల విలువైన సామగ్రిని క్రెడాయ్ బృందం అందజేసింది.

ఇదీ చూడండి :వరంగల్​ రోడ్డు ప్రమాదంలో నాలుగుకు చేరిన మృతుల సంఖ్య

ABOUT THE AUTHOR

...view details