ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పథకాలే తెరాసను గెలిపిస్తాయని ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అన్నారు. రానున్న వరంగల్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయనున్నామని ధీమా వ్యక్తం చేశారు. 66 డివిజన్లకు గాను అన్నింట్లో తెరాస అభ్యర్థులు గెలిచి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని ఎమ్మెల్యే చెప్పారు. హన్మకొండలో వరంగల్ తూర్పు, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు నరేందర్, ఆరూరి రమేష్, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ రామ్మోహన్‌తో కలిసి వినయ్ భాస్కర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ప్రత్యేక దృష్టి..