ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటారు. హన్మకొండలోని జూలైవాడలో మొక్కలు నాటిన ఆయన ప్రతీ ఒక్కరు మొక్కలు నాటడం బాధ్యతగా తీసుకోవాలని అన్నారు. రాబోయే రోజుల్లో మొక్కలు లేకపోతే.. మనిషి మనుగడ కష్టమైపోతుందని అన్నారు. పర్యావరణాన్ని కాపాడాలంటే మొక్కలు నాటడం ఒక్కటే మార్గమని ఆయన అన్నారు. వచ్చేది వర్షకాలం కాబట్టి ఇప్పుడు మొక్కలు నాటితే.. సరిపడా నీళ్లు లభించి చక్కగా చిగురిస్తాయని అన్నారు.
‘ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలి’ - ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్
ప్రతీ ఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆయన హన్మకొండలోని జూలైవాడలో మొక్కలు నాటారు.

‘ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలి’