ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయభాస్కర్ పేర్కొన్నారు. హన్మకొండలో పట్టభద్రులైన తెరాస శ్రేణులతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. పట్టభద్రుల ఎన్నికలపై చర్చించారు.
విపక్షాల అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలి: వినయ్ భాస్కర్ - హన్మకొండలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం
పట్టభద్రుల ఎన్నికల్లో తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అన్నారు. హన్మకొండలో తెరాస శ్రేణులతో ఆయన సమావేశమయ్యారు.
ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ ఎన్నికలు
పల్లా రాజేశ్వర్రెడ్డి గెలుపునకు కార్యకర్తలందరూ కృషి చేయాలని వినయ్ భాస్కర్ సూచించారు. ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:రాష్ట్ర ప్రగతిని వివరిస్తూ నివేదికలు రూపొందించాలి: సీఎస్