నగర అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్(mla dasyam vinay bhaskar) అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ వడ్డేపల్లిలోని చైతన్యపురి కాలనీలో ఆయన పర్యటించారు. స్థానిక 61వ డివిజన్ చైతన్యపురి కాలనీలోని పలు కమిటీ సభ్యులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
డివిజన్లో జరిగిన, పెండింగ్లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కాలనీ ప్రజలు పలు సమస్యలను లిఖిత పూర్వకంగా అందించడంతో చీఫ్ విప్… వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి వాటిని సత్వరమే పరిష్కరించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ రాములు, ఇతర అధికారులు, కాలనీ ప్రజలు పాల్గొన్నారు.
vinay bhaskar: కాలనీ సభ్యులతో ఎమ్మెల్యే సమావేశం - waddepally hanamkonda
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ వడ్డేపల్లిలోని చైతన్యపురి కాలనీని ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్(mla dasyam vinay bhaskar) సందర్శించారు. స్థానిక 61వ డివిజన్లోని పలు కమిటీ సభ్యులతో ఆయన సమావేశం జరిపారు. కాలనీ ప్రజలతో ముచ్చటించి సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
vinay bhaskar: కాలనీ సభ్యులతో ఎమ్మెల్యే సమావేశం